బైజూస్ రవీంద్రన్ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఈడీ

ED issues lookout notice on Byju Raveendran

న్యూఢిల్లీః బైజూస్ వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ పై ఈడీ తన లుకౌట్ నోటీసులను పొడిగించింది. రవీంద్రన్ పై ఈడీ ఫెమా చట్టం కింద దర్యాప్తు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏడాది కింద రవీంద్రన్ పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. అయితే, ఈ నెల మొదట్లో వాటిని పునరుద్ధరించారు. ఈ లుకౌట్ నోటీసుల ప్రకారం… రవీంద్రన్ దేశం విడిచి వెళ్లాలంటే ఈడీకి సమాచారం అందించాల్సి ఉంటుంది. ఈడీ వద్ద ఉన్న సమాచారం మేరకు ప్రస్తుతం రవీంద్రన్ దేశం వెలుపల ఉన్నట్టు తెలుస్తోంది.

రవీంద్రన్ ఆధ్వర్యంలోని థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ విదేశీ మారకద్రవ్య చట్టాన్ని అతిక్రమించినట్టు ఈడీ గుర్తించింది. రూ.9,362 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం కలగడానికి కారణమైనట్టు ఆరోపించింది.