మరోసారి ఢిల్లీలో భూప్రకంపనలు

ఢిల్లీలో కొన్ని సెకన్ల పాటు కంపించిన భూమి

earthquake-hits-nepal-tremors-felt-in-delhi-ncr

న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో ఈరోజు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఈ మధ్యాహ్నం 2.28 గంటలకు నేపాల్ లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది. దాని ప్రభావంతోనే ఢిల్లీలో ప్రకంపనలు వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్సీఎస్)ను ఉటంకిస్తూ ఏఎన్ఐ వార్తాసంస్థ వెల్లడించింది.

ఇటీవల ఢిల్లీ ప్రాంతంలో తరచుగా భూమి కంపిస్తోంది. జనవరి 5న ఆఫ్ఘనిస్థాన్ లో 5.9 తీవ్రతతో భూకంపం రాగా, ఢిల్లీలోనూ, జమ్మూ కశ్మీర్ లోనూ దాని ప్రభావం కనిపించింది. పాకిస్థాన్ సరిహద్దుల్లోనూ గతంలో భూకంపం సంభవించగా, భారత్ లోనూ ప్రకంపనలు వచ్చాయి.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/