ఎమ్మెల్యే రామలింగారెడ్డి కన్నుమూత

అనారోగ్యంతో హైదరాబాద్ ఆసుపత్రిలో చేరిన ఎమ్మెల్యే

MLA Solipeta Ramalinga Reddy

చేగుంట: దుబ్బాక ఎమ్మెల్యె సోలిపేట రామలింగారెడ్డి(57) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన, కన్నుమూశారని కుటుంబీకులు వెల్లడించారు. సిఎం కెసిఆర్‌కు సన్నిహితుడిగా ఉన్న ఆయన, ఇప్పటివరకూ నాలుగుసార్లు దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో విషాదఛాయలు అలముకోగా, టీఆర్ఎస్ నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన స్వస్థలం చిట్టాపూర్ గ్రామం కాగా, ఆయనకు భార్య సుజాత, కుమారుడు సతీశ్ రెడ్డి, కుమార్తె ఉదయశ్రీ ఉన్నారు. 2004లో తొలిసారిగా దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన, 2008 ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆపై 2009లో ఓటమి పాలైనా, 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. జర్నలిస్టు నాయకునిగా పలు ఉద్యమాల్లో పాల్గొన్న ఆయన, కొంతకాలం నక్సలైట్ ఉద్యమంలోనూ పనిచేశారు. సోలిపేట మృతిపై టీఆర్ఎస్ నేతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/