SP బాలు పాటను దుబాయ్ షేక్ ఎంత బాగా పాడాడో చూడండి

ప్రముఖ గాయకుడు దివంగత ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులు ఉన్నారు. ఆయన పాట అంటే ప్రాణంగా భావిస్తుంటారు. బాలు మన మధ్య లేకపోయినా ఆయన పాటలు మాత్రం మన మధ్యే ఉన్నాయి. తెలుగు తో పాటు ఇతర భాషల్లో ఎన్నో పాటలు పాడిన బాలు జనాల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. బాలు పాటలు మన దేశం లోనే కాక ఇతర దేశాల్లోనూ మారుమోగుతుంటాయి . తాజాగా ఓ దుబాయ్ షేక్ ఎస్పీ బాలు పాటను ఎంతో బాగా పాడి ఆకట్టుకున్నారు.

1986లో క్లాసికల్ సూపర్ హిట్ కొట్టిన సిరివెన్నెల మూవీలోని విధాత తలపున.. విక‌సించిన‌ది ఈ గీతం అంటూ సాగే పాటను పాడి దుబాయ్ షేక్ అందరిని అబ్బుర పరిచారు. తెలుగు భాష తెలియకున్నా.. ఎంతో క‌ష్ట‌ప‌డి పాట పాడి అందరిని ఆశ్చర్యపరిచారు. దుబాయ్ షేక్ పాడిన పాట టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మీరు కూడా ఆ వీడియో ఫై లుక్ వెయ్యండి.

YouTube video