ఢిల్లీ పెద్దలు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని రేవంత్ రెడ్డిని సిఎంగా నిర్ణయించారుః డీకే శివకుమార్

dk-shivakumar-says-high-command-decided-chief-minister-candidate

న్యూఢిల్లీః ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో తాము ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకొని అధిష్ఠానానికి నివేదిక అందించామని, ఢిల్లీ పెద్దలు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా నిర్ణయించారని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. అధిష్ఠానానికి అన్ని అంశాలను నివేదించినట్లు చెప్పారు. ఇక నుంచి అధిష్ఠానమే అన్ని నిర్ణయాలను తీసుకుంటుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక అంశంలో డీకే శివకుమార్ కీలక పాత్ర పోషించారు. ఆయన ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయలుదేరారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలు తమకు అధికారం కట్టబెట్టారన్నారు. వారికి సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా రేపు… రేవంత్ ప్రమాణ స్వీకారానికి డీకే శివకుమార్ హాజరు కానున్నారు.