కోర్టుకు విచారణకు హాజరైన మాజీ సిఎం

DEVENDRA FADNAVIS
DEVENDRA FADNAVIS

నాగ్‌పూర్‌: ఈరోజు నాగ్‌పూర్‌ కోర్టులో విచారణకు మహారాష్ట్ర మాజీ సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ హాజరయ్యారు. 2014 ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్లో తనపై నమోదైన రెండు క్రిమినల్ కేసులను దాచిపెట్టినట్టు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసులో ఫడ్నవిస్ ప్రత్యక్ష విచారణ ఎదుర్కోవాలంటూ గతంలో వెలువరించిన తీర్పును పునఃసమీక్షించాలని ఆయన పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం తన తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఫడ్నవిస్ తరపు లాయర్ ముకుల్ రోహత్గీ సమర్పించిన వివరాలు, వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్‌లో పెడుతూ జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/