పవన్ రాజకీయాల గురించి వైసీపీ నేత హాట్ కామెంట్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై కౌంటర్లు వేశారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని..తన డాన్సులన్న , ఫైట్స్ అన్న ఎంతో ఇష్టంగా చూస్తానని..కానీ రాజకీయం పరంగా మాత్రం పవన్ అంటే ఇష్టం లేదని ధర్మాన అన్నారు. రెండు చోట్ల పోటీ చేసి..రెండు చోట్ల ఓడిపోయినా పవన్..జగన్ మోహన్ రెడ్డితో పోల్చుకోకూడదని ధర్మాన హెచ్చరించారు. పవన్ రాజకీయాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు.

పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతీ గ్రామాన్నీ తిరిగిన నాయకుడు జగన్ అని కొనియాడారు. రాష్ట్ర భౌగోళిక పరిస్థితుల పై స్పష్టమైన అవగాహన ఉన్న నాయకుడు జగన్ అని… జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో లేరంటే ప్రపంచంలో ఎవరూ నమ్మరన్నారు. జగన్ కు పోటీ ఎవరూ లేరు…జగన్ కు జగనే సాటి అని కితాబు ఇచ్చారు. శ్రీకాకుళంలో చేనేత బజార్ ప్రారంభించిన ఆయన ధర్మాన పవన్ ను టార్గెట్ చేసి కామెంట్స్ చేసారు. అలాగే నారా లోకేష్ ఫై కూడా ధర్మాన ఫైర్ అయ్యారు. జగన్‌ను నారా లోకేష్ విమర్శించడం సరికాదని.. ఆలోచించి మాట్లాడితే మంచిదన్నారు.