హిందీ లో రిలీజ్ కాబోతున్న ‘సీతారామం’

తెలుగు తో పాటు పలు భాషల్లో సూపర్ హిట్ సాధించిన సీతారామం చిత్రం..ఇప్పుడు హిందీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సెప్టెంబర్ 2వ తేదీన హిందీ వెర్షన్ ను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారిక ప్రకటన చేసారు. మహానటి ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సీతారామం’. సుమంత్, డైరెక్టర్‌ గౌతమ్‌ మీనన్, తరుణ్‌ భాస్కర్‌, మురళి శర్మ, వెన్నెల కిశోర్‌ తదితరులు కీలకపాత్రలు పోషించగా.. హను రాఘవపూడి డైరెక్ట్ చేసాడు. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ సమర్పణలో అశ్వినీదత్‌ నిర్మించారు. భారీ అంచనాల నడుమ ఈ మూవీ ఆగస్టు 5న తెలుగు తో పాటు పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి ప్రేమకథగా మార్కులు కొట్టేసింది. తమిళ .. మలయాళ భాషల్లో కూడా చెప్పుకోదగిన వసూళ్లను రాబట్టింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు బాలీవుడ్ ఆడియన్స్ ను పలకరించడానికి రెడీ అవుతోంది. సెప్టెంబర్ 2వ తేదీన ఈ సినిమా హిందీ వెర్షన్ విడుదలవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. బాలీవుడ్ ప్రేక్షకులు ఈ తరహా ప్రేమకథలను ఎక్కువగా ఇష్టపడతారు. అందునా వాళ్లకి దుల్కర్ .. రష్మికతో పాటు మృణాల్ కూడా బాగా తెలుసు. అందువలన మరింత త్వరగా ఈ కథ వాళ్లకి కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయినా కార్తికేయ 2 హిందీలో వసూళ్ల వర్షం కురిపిస్తుండడం విశేషం.