తెలంగాణలో కొత్తగా 1,879 కేసులు నమోదు

మరో ఏడుగురి మృతి

తెలంగాణలో కొత్తగా 1,879 కేసులు నమోదు
corona virus- Telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా విజిృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో మంగళవారం కొత్తగా 1,879 మందికి కరోనా నిర్ధారణ అయింది. వారిలో 1,422 మంది హైదరాబాద్, పరిసర ప్రాంతాలకు చెందినవాళ్లే. ఓవరాల్ గా తెలంగాణలో ఇప్పటివరకు 27,612 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏడుగురు మృత్యువాత పడగా, రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 313కి పెరిగింది. మంగళవారం 1506 మంది డిశ్చార్జి కాగా, ఇంకా 11,012 మంది చికిత్స పొందుతున్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/