బాలయ్య నటన ఫై మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రశంసలు

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పట్ల సినీ ప్రముఖులు, అభిమానులే కాదు రాజకీయ నేతలు సైతం స్పందిస్తున్నారు. తాజాగా బాలకృష్ణ బావ, తన అక్క పురంధేశ్వరి భర్త.. మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అఖండ చిత్రం ఫై , బాలకృష్ణ నటన ఫై ప్రశంసలు కురిపించారు.

కరోనా జబ్బుతో మూలన పడ్డ చిత్రసీమకు అఖండ సినిమా మందు వేసిందని ఆయన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. బోయపాటి, తమన్ ఈ సినిమాకి ప్రాణం పోయగా.. ప్రాణిగా బాలయ్య జీవించి సార్థకం చేశాడంటూ ప్రశంసలు కురిపించారు.

“బాలయ్య తన సినిమా జీవితంలో గౌతమీపుత్ర శాతకర్ణి తో తన నటన పరాకాష్టకు చెందింది అనుకునేవాడిని. తదుపరి అంతకుమించి సాధ్యపడదని అనుకున్నాను. కానీ నేడు మించాడు” అంటూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రశంసలు కురిపించారు. హిందూత్వం, హిందూ తత్వం గురించి ఎంత మంది చెప్పినా అంతగా హత్తుకొననిది.. హత్తకునేటట్లుగా అఖండ సినిమా చేస్తుందని.. ఈ సినిమా చూస్తే దేవుని మీద విశ్వాసం లేని వాళ్లకు కూడా తమ విశ్వాసం మీద డౌట్ వస్తుందన్నారు. గుళ్లు, గోపురాలకు వివరణ ఇస్తూ.. హోమం ఎందుకు అనేది ఈ సినిమా చెప్తుందని.. బోయపాటి శివతత్వం పరమార్థాన్ని, హిందూత్వాన్ని రిసెర్చ్ చేశారని తెలుస్తుందని’ ఆయన అన్నారు.