రేపటినుండి సెట్స్ పైకి ప్రభాస్ కొత్త చిత్రం

రేపటినుండి సెట్స్ పైకి ప్రభాస్ కొత్త చిత్రం

వరుస పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ..రేపటి నుండి మరో చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నాడు. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ లో ప్రభాస్ కు జోడిగా బాలీవుడ్ క్రేజీ బ్యూటీ దీపికా పదుకొణే నటిస్తుంది. ఈ సినిమాను షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టారు. అయితే తాజా షెడ్యూల్ రేపటి (ఆదివారం) నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం.

అన్నపూర్ణ స్టూడియోస్ లోని ఏడెకరాల్లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో చిత్రీకరణ మొదలు కాబోతోంది. ఈ షెడ్యూల్ లో దీపికా పదుకొణే జాయిన్ కాబోతోంది. ఈ క్రమంలో దీపికాను వెల్ కమ్ ఈ ప్రాజెక్ట్ లోకి ఆహ్వానిస్తూ మేకర్స్ ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. వైజయంతి వారి బ్యానర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా ‘ప్రాజెక్ట్ కె’ నిలిచిపోయింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం విడుదల కాబోతున్న ‘ప్రాజెక్ట్ కె’ చిత్రం ప్రభాస్ కు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి. ఇక ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ మూవీ తో జనవరి 07 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.