జనతా కర్ఫ్యూలో అందరూ పాల్గొనాలి

ఫ్యాన్స్‌కు సిఎస్‌కె పిలుపు

CSK (File)

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు భారత్‌ దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తుండటంతో ఐపిఎల్‌లీగ్‌ను బిసిసిఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ఈక్రమంలో వివిధ ఫ్రాంచైజీలు తమ ప్రాక్టీస్‌ సెషన్లుకూడా వాయిదావేసాయి.

గత ఏడాది రన్నరప్‌మూడుసార్లు ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ కూడా తమ ప్రాక్టీస్‌ సెషన్‌ను గతవారమే రద్దుచేసింద.ఇ ఇక కరోనావైరస్‌కు సంబంధించి అనేక జాగ్రత్తలు తీసుకోవాలని తాజాగా చెన్నై ట్విట్టర్‌లో అభిమానులకు సూచిస్తూ పోస్టుచేసింది.

ఆదివారం జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని ప్రధాని నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపునకు సిఎస్‌కె స్పందించింది.

కర్ఫ్యూలో అందరూ పాల్గొనాలని సిఎస్‌కె సూచించింది. ఈ వారాంతం అంతా ఇళ్లల్లోనే గడపాలని మీకుటుంబసభ్యుల ఆరోగ్యంపై సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సిఎస్‌కె ట్వీట్‌చేసింది.

ఈ క్రమంలో వైరస్‌ను అదుపులో ఉంచేందుకు అందరూ సహకరించాలని సూచించింది. ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు ఈలలు వేసి అందరూ సంఘీభావం తెలపాలని వెల్లడించింది.

యితే చేతులు వాడకుండా ఈలలు వేయాలని చమత్కరించింది.

మరోవైపు ఇండియాలో ఇప్పటికే కరోనా పాజిటివ్‌కేసులు సంఖ్య 250కి పెరిగింది. ఇప్పటికే ఈ మహమ్మారికారణంగా ఐదుగురు చనిపోయిన సంగతి తెలిసిందే.

తాజా ‘చెలి’ శీర్షికల కోసం : https://www.vaartha.com/specials/women/