టి20 ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌కు రిజర్వుడే

క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రతిపాదన

Cricket Australia’s proposal

సిడ్నీ: ఆస్ట్రేలియా గడ్డపై అక్టోబరులో జరిగే పురుషుల టీ20 ప్రపంచకప్‌ సెమీ ఫైనల్స్‌లో రిజర్వ్‌డే ఉంచాలని అంతర్జాతీయ క్రికెట్‌కమిటీ నిర్వహించే సమావేశంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రతిపాదించాలని నిర్ణయించింది.

ఇటీవలే ఆసిస్‌లో జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్స్‌కు రిజర్వ్‌డే లేకపోవడంతో ఐసిసి తీరుపై సర్వత్రా విమర్శలు వచ్చాయి.

ఈ మెగా టోర్నీ నిర్వ హించిన సిఎ కూడా నాకౌట్‌ మ్యాచ్‌లకు రిజర్వుడే ప్రస్తావన తేక పోవడంతో ఐసిసి తేలిగ్గాతీ సుకుంది.

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌ భారత్‌ల మధ్య జరగాల్సిన సెమీఫైనల్‌ మ్యాచ్‌ భారీ వర్షం కారణంగా రద్దయింది.

దానికి రిజర్వుడే లేని కారణంగా గ్రూప్‌ దశలో అగ్రస్థానంలో ఉన్న హర్మన్‌షేన ఫైనల్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. రిజర్వుడే లేకపోవడం ఇంగ్లండ్‌కు శాపంలా మారింది.

మ్యాచ్‌ ఆడకుండానే టోర్నీని సెమీస్‌తోనే ముగించడంపై ఇంగ్లండ్‌ ఆందోళన వ్యక్తంచేసింది.

అయితే వేరే ప్రత్యామ్నాయం లేకపోవ డంతో భారంగా టోర్నీనుంచి నిష్క్రమించింది.

అయితే పురుషుల ప్రపంచకప్‌లో ఇలాంటిపరిస్థితులు తలెత్తక ుండా ఉండాలని ఐసిసి నిర్వహించే సమావేశంలో సెమీస్‌ కు రిజర్వ్‌డే గురించి సిఎ చర్చించే అవకాశం ఉందని ఐసిసి ప్రతినిధి తెలిపారు.

రిజర్వుడేప్రతిపాదనను సిఎ సిద్ధంచేసిందట. ఐసిసి నిర్వహించబోయే సమావేశంలో నాకౌట్‌మ్యాచ్‌లకు రిజర్వుడే ప్రస్తావన తేవాలనినిర్ణయిం చింది.

మహిళల ప్రపంచకప్‌కు రిజర్వుడేప్రతిపాదనను మరిచిన సిఎ ఈసారిఆ తప్పిదం చేయకూడదనే భావన లో ఉంది.

పురుషుల టీ20 ప్రపంచకప్‌లో రిజర్వుడే ఉంటుందని ఆస్ట్రేలియా క్రికెట్‌బోర్డు సిఇఒ కెవిన్‌ రాబర్డ్స్‌ ఆశతో ఉన్నారు.

మహిళల టోర్నీలో ఏర్పడిన పరిస్థి తులు భవిష్యత్తుల్లో నిర్వహించే టోర్నీలపై ప్రభావం చూపిస్తుంది.

పురుషుల టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో కూడా రిజర్వుడే ఉంచాలని ఎంతోమంది భావిస్తున్నారు. అయితే మహిళల ప్రపంచకప్‌ సెమీస్‌లో రిజర్వుడే లేనందుకు ఇంగ్లండ్‌మహిళల జట్టుకు ఎంతో బాధ ఉం టుంది.

పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health/