స్మార్ట్‌ఫోన్ల వాడకంపై నిషేధం విధించిన సీఆర్పీఎఫ్‌

న్యూఢిల్లీ: సెంట్ర‌ల్ రిజ‌ర్వ్ పోలీసు ఫోర్స్(సీఆర్పీఎఫ్‌) స‌్మార్ట్‌ఫోన్ల వాడ‌కంపై నిషేధం విధించింది. అత్యంత కీల‌క స‌మావేశాలు జ‌రిగే ప్రాంతాలు, సున్నిత‌మైన ప్ర‌దేశాల్లో స్మార్ట్ ఫోన్లు వినియోగంపై నిషేధం విధిస్తూ సీఆర్పీఎఫ్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వులు సీఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు జ‌వాన్లకు వ‌ర్తిస్తాయ‌ని తెలిపింది. ఒక వేళ స్మార్ట్ ఫోన్‌ను ఆఫీసుకు తీసుకెళ్తే.. అక్క‌డ ఏర్పాటు చేసే ప్ర‌త్యేక కౌంట‌ర్ల‌లో ఉంచుతారు. స‌మాచార భ‌ద్ర‌త దృష్ట్యానే స్మార్ట్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించామన్నారు. అధికంగా స్మార్ట్ ఫోన్లు వాడ‌డం వ‌ల్ల భ‌ద్ర‌త ఉల్లంఘ‌న‌కు దారి తీసే అవ‌కాశం ఉంద‌న్నారు. సీఆర్పీఎఫ్ స‌మాచారాన్ని గోప్యంగా ఉంచేందుకు ఈ విధానం ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. కెమెరా లేని, రికార్డు చేయ‌డానికి సాధ్య ప‌డ‌ని మొబైల్స్ కు కొన్ని ప్రాంతాల్లో అనుమ‌తించ‌నున్న‌ట్లు సీఆర్పీఎఫ్ అధికారులు పేర్కొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/