ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడినట్లే
రైతులకు, రైతు సంఘాలకు సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారు

అమరావతి: టిడిపి నేత దేవినేని ఉమా మహేశ్వరరావు సిఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ఏపిలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలన్న వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వ నిర్ణయంపై ఆయన మాట్లాడుతూ..ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పాడే ప్రక్రియను చేపడుతున్నారని ఆయన ఆరోపించారు. ‘అన్నదాతల్లో మీటర్ భయం, వాడకం పెరిగితే షాకేనా? అదనపు బిల్లులు రైతులే చెల్లించాలా? నగదు బదిలీలో సర్కారును నమ్మలేం, జీవోలో స్పష్టతలేదని తేల్చిచెబుతున్న రైతు సంఘాలు. అప్పులకోసం మమ్మల్ని బలిచేస్తారా? ఉచిత విద్యుత్ కు మంగళం పాడినట్లేనంటున్న రైతులకు, రైతు సంఘాలకు సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారు’ అంటూ దేవినేని ఉమ ట్విట్టర్‌లో విమర్శలు గుప్పించారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/