2023-25 సంవత్సరాలకు గానూ కొత్త మేనేజింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకున్న క్రెడాయ్ హైదరాబాద్

• నూతన బృందం సుస్థిర అభివృద్ధి లక్ష్యం చేరుకోవటానికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేస్తుంది.

• ఆధునిక ఎత్తైన భవనాలు ( హై రైజ్ భవంతులు ) నిర్మాణానికి అవసరమైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాల పట్ల శ్రామికశక్తి నైపుణ్యంపై దృష్టి కేంద్రీకరించింది

Credai Hyderabad elected new Managing Committee members for the year 2023-25

హైదరాబాద్‌: కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్, 2023 నుండి 2025 వరకు నూతన మేనేజింగ్ కమిటీని నియమించినట్లు ప్రకటించింది, వీరు హైదరాబాద్‌లో క్రెడాయ్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి మరియు బలోపేతం చేయడానికి , ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి తోడ్పడతారు. కొత్త బృందానికి శ్రీ వి. రాజశేఖర్ రెడ్డి నాయకత్వం వహిస్తారు, ఈయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, శ్రీ బి. జగన్నాథరావు ప్రధాన కార్యదర్శిగా, శ్రీ ఎన్ జైదీప్ రెడ్డి ప్రెసిడెంట్- ఎలెక్ట్ గా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా శ్రీ బి ప్రదీప్ రెడ్డి, శ్రీ సి జి మురళీ మోహన్, శ్రీ కొత్తపల్లి రాంబాబు, శ్రీ ఎం శ్రీకాంత్ ఎన్నిక కాగా, కోశాధికారిగా శ్రీ మనోజ్ కుమార్ అగర్వాల్, సంయుక్త కార్యదర్శులుగా శ్రీ జి. నితీష్ రెడ్డి, శ్రీ క్రాంతి కిరణ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా శ్రీ ఎ. వెంకట్ రెడ్డి, శ్రీ బి. జైపాల్ రెడ్డి, శ్రీ సంజయ్ కుమార్ బన్సల్ , శ్రీ సి. అమరేందర్ రెడ్డి, శ్రీ సుశీల్ కుమార్ జైన్, శ్రీ మోరిశెట్టి శ్రీనివాస్, శ్రీ ముసునూరు శ్రీరామ్, శ్రీ ఎన్.వంశీధర్ రెడ్డి, ఎన్నిక కావటం తో పాటుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి అందరం కలిసి పని చేయనున్నారు.

మెరుగైన సామర్థ్యం మరియు ఉత్పాదకతను సులభతరం చేయడానికి, నగరంలో స్థిరమైన రియల్ ఎస్టేట్ వృద్ధిని ప్రోత్సహించడానికి మరియు ‘అందరికీ గృహాలు’ అనే లక్ష్య సాకార దిశగా నిర్వహించే కార్యక్రమాలను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయటం తో పాటుగా, ఎత్తైన ఆధునిక భవనాలను నిర్మించే అవసరాలకు అనుగుణంగా శ్రామిక శక్తి యొక్క సాంకేతిక నైపుణ్యాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కొత్త బృందం ఎజెండాను నిర్దేశించుకుంది.

కొత్త మేనేజింగ్ కమిటీ ఎజెండాను వివరించిన , క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ శ్రీ వి. రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ నెలలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నందున మేము చాలా కీలకమైన సమయంలో బాధ్యతలు స్వీకరిస్తున్నాము. రాష్ట్రం అభివృద్ధి పథంలో కొనసాగుతుందన్న నమ్మకం ఉంది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం లో అభివృద్ధి కనిపిస్తుంది మరియు నివాస , వాణిజ్య స్థలం రెండింటికీ ఒకే తరహా వృద్ధి కొనసాగుతోంది. తాజా నివేదిక ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరం 9 నెలల్లో లగ్జరీ హౌసింగ్ విభాగంలో 260% వృద్ధిని హైదరాబాద్ నమోదు చేసింది, ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉంది. క్యూ3 2023లో 2.9 మిలియన్ చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లావాదేవీలతో నగరం దేశంలోనే అత్యధిక కొత్త కార్యాలయాలు మరియు స్వీకరణ ను నమోదు చేసింది. ఇది రియల్ ఎస్టేట్‌లో తాజా వృద్ధిని మరియు డిమాండ్‌ను ప్రేరేపిస్తుంది. కమర్షియల్, రిటైల్, వేర్‌హౌసింగ్ మరియు రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అంతటా డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని మేము ఆశిస్తున్నాము , ఇది పెరిగిన కార్యాచరణ కారణంగా ధరల పెరుగుదల మరియు ఉద్యోగ సృష్టిని ప్రేరేపిస్తుంది…” అని అన్నారు.

శ్రీ రెడ్డి మరింతగా మాట్లాడుతూ, “రాష్ట్రానికి రియల్ ఎస్టేట్‌ను ప్రధాన వృద్ధి ఇంజిన్‌గా మార్చడానికి మేము ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నాము. స్థిరమైన అభివృద్ధిపై దృష్టి సారించి మౌలిక సదుపాయాల కల్పనను కొనసాగిస్తాము. స్వీయ సమృద్ధి కమ్యూనిటీలను అభివృద్ధి చేయడానికి గ్రీన్ బిల్డింగ్ పద్ధతులను అవలంబించడానికి మా సభ్య డెవలపర్‌లందరినీ మేము ప్రోత్సహిస్తాము మరియు శిక్షణ ఇస్తాము, తద్వారా కార్బన్ పాదముద్రను తగ్గించనున్నాము. మెరుగైన నిర్మాణ కార్యకలాపాలు మరియు ఎత్తైన భవనాల అవసరంతో, బిల్డర్‌లకు నిర్మాణం మరియు పర్యవేక్షణ కోసం తాజా సాంకేతికతలలో నైపుణ్యం కలిగిన శ్రామికశక్తి అవసరం. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌ల రూపకల్పన, నిర్మాణం మరియు పర్యవేక్షణలో AI & ML వినియోగం పెరిగింది. క్రెడాయ్ హైదరాబాద్‌లో ఉన్న మేము పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా – కొత్త సాంకేతిక పరిజ్ఞానాలలో నైపుణ్యం కలిగిన మానవశక్తి లభ్యతను నిర్ధారించడానికి ప్రభుత్వం మరియు విద్యా సంస్థలతో కలిసి పని చేస్తాము.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం అద్భుతమైన ప్రగతిని సాధించింది. అభివృద్ధి అనుకూల విధాన ఫ్రేమ్‌వర్క్, వినియోగదారుల సంతృప్తి మరియు నైతిక నిర్మాణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటం మరియు రెరా నుండి మార్గదర్శకాలపై ప్రభుత్వంతో కలిసి పనిచేయడంపై కీలక దృష్టితో క్రెడాయ్ అందించిన సహకారం ఎనలేనిది. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి అసాధారణమైన ఖ్యాతి మరియు సమ్మతిని నిర్ధారించడానికి మేము మా సభ్యులకు శిక్షణా కార్యక్రమాల ద్వారా మద్దతు ఇస్తాము…” అని అన్నారు.

ప్రెసిడెంట్- ఎలెక్ట్ శ్రీ ఎన్ జైదీప్ రెడ్డి మాట్లాడుతూ, “తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి హైదరాబాద్ నగరం స్థిరమైన అభివృద్ధిని సాధించింది, దీనికి బలమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు చురుకైన రీతిలో పరిశ్రమలకు అనుకూలమైన ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఇది దాని సాంకేతిక నైపుణ్యం, అనుకూలమైన వాతావరణం మరియు చారిత్రక ఆకర్షణకు ప్రసిద్ధి చెందింది. 2023 రెండవ త్రైమాసికంలో హైదరాబాద్ నివాస డిమాండ్‌లో 11% పెరుగుదలను నమోదు చేసింది. ప్రపంచ అనిశ్చితులు మరియు స్పష్టంగా కనిపించే మందగమనం ఉన్నప్పటికీ, హైదరాబాద్ యొక్క ప్రాపర్టీ మార్కెట్ గత సంవత్సరంలో , ఆస్తి రేట్లలో మొత్తం 16% పెరుగుదలతో స్థిరంగా ఉంది. ఇదే తరహా పోల్చదగిన మౌలిక సదుపాయాలు కలిగిన ఇతర ప్రధాన భారతీయ నగరాలతో పోల్చినప్పుడు, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ సాపేక్షంగా సరసమైన గృహ ఎంపికలను అందిస్తుంది. ఈ స్థోమత అంశం మొదటిసారి గృహ కొనుగోలుదారులు మరియు పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు మరియు స్థిరమైన అభివృద్ధిని అందించే ఆదర్శ పెట్టుబడి మరియు వ్యాపార గమ్యస్థానంగా హైదరాబాద్ ఖ్యాతిని మరింత పెంపొందించడానికి క్రెడాయ్ వద్ద మేము ప్రభుత్వంతో కలిసి పని చేస్తాము…” అని అన్నారు.

క్రెడాయ్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ శ్రీ బి. జగన్నాథరావు మాట్లాడుతూ , “స్థిరమైన రాజకీయ వాతావరణాన్ని కలిగి ఉన్నందుకు హైదరాబాద్ ప్రసిద్ధి చెందింది, ఇది పెట్టుబడులు మరియు కంపెనీలను ఆకర్షించడంలో కీలకమైనది. రియల్ ఎస్టేట్ డిమాండ్ పెరుగుదల ఫలితంగా కొనుగోలుదారులు మరియు పెట్టుబడిదారులకు ఇది ఇప్పుడు ప్రముఖ గమ్యస్థానంగా మారింది. బలమైన వ్యాపారం, ఐటీ మరియు ఔషధ పర్యావరణ వ్యవస్థ దీనికి కారణాలు, అనేక అంతర్జాతీయ సంస్థలు మరియు స్టార్టప్‌లు నగరంలో ప్రధాన కార్యాలయాలను స్థాపించాలని నిర్ణయించుకున్నాయి, హైదరాబాద్ దేశం యొక్క జీడీపీ కి భారీగా దోహదపడుతోంది.

నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక ప్రకారం, హైదరాబాద్‌లో సెప్టెంబర్ 2023లో 6,185 రెసిడెన్షియల్ ప్రాపర్టీలు నమోదయ్యాయి. ఈ నెలలో నమోదైన ఆస్తుల మొత్తం విలువ రూ.3,378 కోట్లు. H2 2023లో మార్కెట్‌ను ప్రభావితం చేసే అనేక చమత్కార ధోరణులతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది. సరసమైన గృహాల పెరుగుదల, వాణిజ్య రియల్ ఎస్టేట్ విస్తరణ, కో -లివింగ్ స్పేస్ ల ఆవిర్భావం, గేటెడ్ కమ్యూనిటీల విస్తరణ , స్మార్ట్ హోమ్‌లకు ప్రజాదరణ మరియు స్థిరమైన అభివృద్ధికి ప్రాధాన్యత ఇక్కడ కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై వీటి ప్రభావం గణనీయంగా ఉంటుంది. క్రెడాయ్ లోని ఈ కొత్త కార్యవర్గం , ప్రాపర్టీ మేనేజ్‌మెంట్ మరియు సేల్స్ మేనేజ్‌మెంట్ కోసం కొత్త సాంకేతికతను అవలంబించడం ద్వారా ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌ను ఎక్కువగా ఉపయోగించుకోవడంలో సభ్యులకు మద్దతుగా పని చేస్తుంది. అంతేకాకుండా, పెరిగిన కార్యాచరణకు నైపుణ్యం కలిగిన మానవశక్తి లభ్యత అవసరం కూడా అధికంగా ఉంటుంది. వృద్ధికి తోడ్పడేందుకు నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యతను నిర్ధారించడానికి మేము సంబంధిత అధికారులతో కలిసి పని చేస్తాము…” అని అన్నారు.