మహబూబాబాద్ జిల్లాలో ఘోరం..ఎస్సై ని వెంటాడి చంపిన మృతువు

మనిషి ఆయుష్షు తీరిందంటే మృతువు ఏదొక రూపంలో వచ్చి ప్రాణాలను తీసుకొని వెళ్తుందని పెద్దలు అంటుంటారు. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో అదే జరిగింది. మరిపెడ పోలీసు స్టేషన్​లో సెకండ్​ ఎస్​ఐగా విధులు నిర్వహిస్తున్న భిక్షపతిని మృత్యువు అలాగే వెంటాడి ప్రాణాలు తీసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

మరిపెడ PS లో సెకండ్ ఎస్ఐగా విధులు నివహిస్తున్న రామటెంక భిక్షపతి(59) మరిపెడ నుంచి మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్తుండగా పురుషోత్తమయగూడెం గ్రామ శివారులో బుధవారం రాత్రి కారు ముందు కుడి పక్క టైరు పేలింది. దీంతో కారు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గాయపడ్డ భిక్షపతిని స్థానిక పోలీసులు హుటాహుటిన మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. అంతకు ముందు నాలుగు రోజుల క్రితం ఇదే దారిలో విధులు ముగించుకొని మహబూబాబాద్ లోని ఇంటికి బైకు పై వెళ్తుండగా లచ్చ తండా వద్ద బైకు గేదెను ఢీకొని గాయపడ్డారు. స్వల్ప గాయాలు కాగా నిన్న బుధువారం హైదరాబాద్ ఆస్పత్రిలో చెకప్ చేసుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా మరో మారు ప్రమాదానికి గురై మృతి చెందారు. ఇలా భిక్షపతిని మృత్యువు వెంటాడి ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన తో భిక్షపతి కుటుంబం శోకసంద్రంలో పడిపోయారు.