కరోనా ఎఫెక్ట్‌: టాయిలెట్‌ పేపర్ల కోసం మహిళల కొట్లాట

Women's fighting at toilet paper shop
Women’s fighting at toilet paper shop

సిడ్నీ: కరోనా వైరస్‌ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంది. అయితే అదే కరోనా ప్రభావం కొందరు మహిళల మధ్య వాగ్వాదానికి దారి తీసింది. కరోనా ప్రభావంతో మాస్కులు, టాయిలెట్‌ పేపర్ల కొరత ఏర్పడుతోంది. దీంతో షాపింగ్‌ మాల్‌లో టాయిలెట్‌ పేపర్ల కోసం కొందరు మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న ఓ సూపర్‌మార్కెట్‌లో చోటు చేసుకుంది. ఆ షాపింగ్‌ మాల్‌లో కొన్ని టాయిలెట్‌ పేపర్లు మాత్రమే ఉన్నాయి. అవి తమకే కావాంలటూ ముగ్గురు మహిళలు కొట్టుకోవడం ఈ వీడియోలో కనపడుతోంది. ఓ మహిళ జట్టును మరో మహిళ పట్టుకుని కొట్టింది. దీంతో సూపర్‌ మార్కెట్ సిబ్బంది జోక్యం చేసుకుని వారిని విడిపించారు. ఇటీవల జరిగిన ఈ ఘటనను ఓ న్యూస్‌ ఛానెల్‌ తమ యూట్యూబ్‌లో పోస్ట్ చేసింది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/