బ్రెజిల్‌లో 22,048 కొత్త కేసులు

Corona virus- Brazil

బ్రెసిలియా : బ్రెజిల్‌లో కరోనా విజృంభన కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 22,000కుపైగా కేసులు నమోదు కాగా, 700 మందికిపైగా వైరస్‌ బారిన పడి మరణించినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. తాజాగా 22,048 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 3,057,470కు చేరుకుంది. వైరస్‌ బారిన పడి కొత్తగా 703 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 101,752 మంది మృత్యువాత పడ్డారు. సుమారు 20లక్షల మందికి పైగా కరోనా నుంచి కోలుకున్నారు.  ప్రపంచవ్యాప్తంగా కరోనాతో మరణించిన వారి సంఖ్య 728,000కు చేరింది. కేసుల సంఖ్య 19.7 మిలియన్లు దాటింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/