లైగర్ షూటింగ్ కు బ్రేక్..

కరోనా మరోసారి లైగర్ ను ఆపేసింది. విజయ్ దేవరకొండ – పూరి జగన్నాధ్ కలయికలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ లైగర్. గత రెండేళ్లుగా ఈ సినిమా సెట్స్ ఫై నడుస్తూనే ఉంది. పూరి సినిమా అంటే ఆరు నెలలో పూర్తై ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలాంటిది ఫస్ట్ టైం ఒకే సినిమాను రెండేళ్లుగా తెరకెక్కిస్తున్నాడు.దీనికి కారణం కరోనా తీవ్రత వల్లే. ఈ సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుండి కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. కరోనా తగ్గినప్పుడు సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తు..లాక్ డౌన్ టైం ఆపేస్తు వస్తున్నారు. ప్రస్తుతం లాస్ట్ షెడ్యూల్ లో ఉంది. మరో నెల రోజులైతే సినిమా షూటింగ్ అంత పూర్తీ అవుతుంది. ఈ క్రమంలో కరోనా , ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండడం తో చిత్ర యూనిట్ సినిమా షూటింగ్ ను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

క‌రోనా కేసుల పెరుగుతున్న స‌మ‌యంలో ఈ సినిమా సిబ్బందిని న‌టీన‌టుల‌ను ఇబ్బందుల‌కు గురి చేయ‌వ‌ద్ద‌నే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు నిర్మాత ఛార్మి తెలిపారు. అంద‌రూ ఇంట్లోనే సేఫ్ గా ఉండాల‌ని ట్విట్ట‌ర్ ద్వారా ఛార్మీ కోరింది. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస పెట్టి కరోనా బారినపడుతున్నారు. నిన్న ఒక్క రోజే సూపర్ స్టార్ మ‌హేష్ బాబు, మంచు ల‌క్ష్మీ, సీనియ‌ర్ హీరోయిన్ మీనా, వరలక్ష్మి శరత్ కుమార్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లు కరోనా బారిన పడ్డారు.