క్యాన్సర్ కేర్‌లో… కాంటినెంటల్ హాస్పిటల్ మరో ముందడుగు

Continental Hospital is another step forward in cancer care

హైదరాబాద్: క్యాన్సర్.. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య. విశ్వవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కోటిమంది క్యాన్సర్ తో మరణిస్తున్నారు. మనదేశంలో అత్యధిక మరణాలకు కారణమవుతున్న వ్యాధుల్లో మొదటి స్థానం గుండె జబ్బులది కాగా, ఆ తరవాత స్థానం క్యాన్సర్ది. వర్ధమాన దేశాలు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న దేశాల్లో పది మరణాల్లో దాదాపు ఏడు మరణాలు కేన్సర్ కారణంగానే జరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు, వృద్ధాప్య జనాభా, మెరుగైన రోగనిర్ధారణ పద్ధతులు అందుబాటులో లేని కారణంగా భారతదేశంలో క్యాన్సర్ వేగంగా పెరుగుతోంది.

నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ 2020 నివేదిక ప్రకారం… భారతదేశంలో 2020లో మొత్తం క్యాన్సర్ కేసుల సంఖ్య 1.39 మిలియన్లు (100,000 జనాభాకు 10. ఇది 2025 నాటికి 1.57 మిలియన్లకు (100,000 జనాభాకు 108.6) పెరిగే అవకాశం ఉంది. సంఖ్యాపరంగా తక్కువ కన్పిస్తున్నప్పటికీ… వాస్తవ పరిస్థితుల్లో ఈ సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. మన దేశంలో క్యాన్సర్ బాధితుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరికి, వ్యాధి ముదిరిన తరవాతే ఇది నిర్ధారణ అవుతోంది. దీంతో బతికే అవకాశాలు తగ్గిపోతున్నాయి. అవగాహన లేకపోవడం, నిరక్షరాస్యత, భయం, వివిధ రకాల అపోహల వల్లే క్యాన్సర్ నిర్ధారణ ఆలస్యం అవుతోంది. ఈ భయాలు, అపోహలను తరిమేసి, క్యాన్సర్ నుంచి ప్రజలను కాపాడేందుకు… హైద్రాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్స్ క్యాన్సర్ కేర్ లో మరో ముందుడుగు వేసింది.

USAలో దశాబ్దాలుగా పనిచేసిన సుప్రసిద్ధ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, డాక్టర్ గురు ఎన్ రెడ్డి గారు, అమెరికాలో వలె భారతదేశంలో కూడా “MD ఆండర్సన్ క్యాన్సర్ ఉన్నంటి సౌకర్యాలతో ఒక క్యాన్సర్ సెంటర్ ఉంటే బాగుండనుకున్నారు. ఆ కోవలోనే… హైద్రాబాద్ గచ్చిబౌలిలో ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన క్యాన్సర్ కేర్ స్పెషల్ సెంటర్ ను మన కాంటినెంటల్ హాస్పిటల్ లో ఏర్పాటు చేశారు. దీన్ని మన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ కేసీఆర్ గారు 2014 సంవత్సరంలో సెప్టెంబర్ 27వ తేదీన ప్రారంభించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో TrueBeam STx System తో ప్రారంభమైన మొట్టమొదటి క్యాన్సర్ కేర్ సెంటర్… మన కాంటినెంటల్ హాస్పిటల్ మాత్రమే.

30 మందికి పైగా మెడికల్, సర్జికల్, రేడియేషన్ ఆంకాలజిస్టుల బృందం గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు, న్యూక్లియర్ మెడిసన్, జెనెటిక్స్, రేడియాలజిస్ట్ నిపుణులు, న్యూట్రిషన్ & ప్రివెంటివ్ ఆంకాలజీ నిపుణులు, ఇలా అనేక రకాల నిష్ణాతులైన డాక్టర్ల పర్యవేక్షణలో కాంటినెంటల్ క్యాన్సర్ కేర్ సెంటర్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో వైద్య సేవలనందిస్తుంది.

టోటల్ క్యాన్సర్ కేర్ మరియు క్యాన్సర్ నుండి పూర్తిగా విముక్తి అనే నినాదం0త పనిచేస్తున్న మా కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్.. ఇప్పుడు మరో మైలురాయిని చేరుకుంది. డాక్టర్ గురు ఎన్ రెడ్డిగారి ఆధ్వర్యంలో… క్యాన్సర్ చికిత్సలో ప్రఖ్యాత వైద్యనిపుణులుగా పేరుపొందిన డాక్టర్ పి. జగన్నాథ్ గారు… ఇప్పుడు మన కాంటినెంటల్ క్యాన్సర్ కేర్ సెంటర్ కు నేతృత్వం వహిస్తూ.. ఈ విభాగాన్ని మరింతగా విస్తరించనున్నారు.

ప్రఖ్యాత సర్జికల్ అంకాలజిస్ట్ డా. పి. జగన్నాథ్ MS. FRCS. FAMS గారికి క్యాన్సర్ వైద్యంలో నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉంది. జగన్నాథ్ గారు ప్రతిష్టాత్మకమైన టాటా మెమోరియల్ హాస్పిటల్లో 20 సంవత్సరాలు, సుప్రసిద్ధ లీలావతి హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్లో మరో20 సంవత్సరాలు, ముంబయి లోని రహేజా హాస్పిటల్ లో కొన్నాళ్ళపాటు వైద్యసేవలు అందించారు. ఇప్పుడు మన డాక్టర్ గురు ఎన్ రెడ్డి గారితో కలిసి కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్ ని, దేశంలోని క్యాన్సర్ కేర్ కు సంబంధించిన ప్రధాన సంస్థల్లో అగ్రగామిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.

కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్ ప్రత్యేకత

క్యాన్సర్ ని నయంచేయడం దగ్గర్నుండి మళ్ళీ క్యాన్సర్ బారిన పడకుండా ట్రీట్ మెంట్ చేయడం మా ప్రత్యేకత. ఇదంతా కూడా… కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ జగన్నాథ్ మరియు వాళ్ళ ప్రత్యేక నిపుణుల బృందం ఆధ్వర్యంలో జరుగుతుంది.

కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్.. నైతికతతో పనిచేస్తుంది. డాక్టర్ ని నమ్మి వచ్చిన పేషెంట్ కి భరోసా కల్గించి, వాళ్ళ భవిష్యత్ కు కొత్త దారి చూపడమే

కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్ ప్రధాన ఉద్దేశ్యం. అత్యున్నతస్థాయి ప్రమాణాలను పాటిస్తూ.. అన్ని రకాలుగా పేషెంట్ గా అండగా ఉంటూ.. నాణ్యమైన వైద్యాన్ని అందిస్తుంది.

ఇతర దేశాలతో పోలిస్తే, మన దేశంలో క్యాన్సర్ బాధితుల శాతం తక్కువ ఉన్నప్పటికీ, తొలి దశలో గుర్తించలేక పోవడంతో క్యాన్సర్ మరణాల శాతం ఎక్కువగా నమోదు అవుతోంది. అందుకే.. కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్, దీనిపై ఎక్కువ దృష్టిపెట్టింది. అడ్వాన్స్డ్ ఎక్విప్ మెంట్స్ ను ఉపయోగించి అన్ని రకాల పరీక్షలు చేసి.. క్యాన్సర్ ని స్టార్టింగ్ స్టేజ్ లోనే గుర్తిస్తుంది. దీనివల్ల వ్యాధిని నయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రోగికి.. చికిత్సకయ్యే ఖర్చులు కూడా చాలావరకు తగ్గుతాయి. క్యాన్సర్ ని ఇలా తొలి దశలోనే గుర్తించి చికిత్స చేయడం ద్వారా క్యాన్సర్ మరణాల్లో దాదాపు మూడింట ఒక వంతును అడ్డుకోవచ్చు.

ఉదాహరణకు, గర్భాశయ క్యాన్సర్ ని మొదటి, రెండు దశలో 2500 రూపాయల HPV వ్యాక్సినేషన్, మరియు VA పరీక్షతో గుర్తించగలిగితే.. దాన్ని కేవలం 50 వేల రూపాయల వైద్యంతో పూర్తిగా నయం చేయవచ్చు. అలా కాదని మూడో దశలో గుర్తిస్తే.. దాన్ని నయం చేయడానికి దాదాపు 4-5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయినా ఈ దశలో 40-50 శాతం వరకే మనం గ్యారంటీ ఇవ్వగలం. అదే మొదటి స్టేజ్ లో అయితే 95 శాతం వ్యాధిని నయం చేయడానికి అవకాశం ఉంటుంది. మన దేశంలో సర్వసాధారణంగా వచ్చే రొమ్ము క్యాన్సర్ మరియు నోటి క్యాన్సర్ల విషయంలో ఇదే జరుగుతుంది.

హైద్రాబాద్ తో పాటు… రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నాణ్యమైన క్యాన్సర్ కేర్ ను విస్తరించడానికి, కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్ వివిధ జిల్లాల్లో నోడ్లను ఏర్పాటు చేస్తూ.. హబ్-అండ్-స్పోక్ విధానంతో క్యాన్సర్ కేర్ మోడల్ను, మరింత ముందుకు తీసుకెళ్తుంది. వివిధ ప్రాంతాలకు చెందిన పేషెంట్స్, మా హాస్పిటల్ ప్రొవైడ్ చేసిన సింగిల్ కాంటాక్ట్ నంబర్ మరియు కన్సల్టేషన్ పోర్టల్ను ఉపయోగించుకుని సాధ్యమైనంత మెరుగైన వైద్యసేవలను పొందవచ్చు. హైద్రాబాద్ కేంద్రంగా ఉంటూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మా కాంటినెంటల్ క్యాన్సర్ కేర్ ప్లాన్ ని అందుబాటులోకి తేవడం ఇక్కడే ప్రథమం.

కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్ ఒక్క మన దేశంలోనే గాకుండా… కామెరూన్, సొమాలియా, కెన్యా, నైరోబి, ఇంకా ఇతర దేశాల్లో వైద్య సేవలను అందిస్తుంది. రిమోట్ కన్సల్టేషన్స్, విర్చువల్ ట్యూమర్ బోర్డ్స్, టెలీ కన్సల్ట్స్, టెలిపాథాలజీ, ఇంకా డిజిటల్ నావిగేషన్ సెంటర్ ద్వారా వివిధ దేశాల్లో ఉన్న తమ పేషెంట్స్ కి ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుంది మా క్యాన్సర్ సెంటర్ టీమ్.

హైద్రాబాద్ లోనే మా కాంటినెంటల్ క్యాన్సర్ కేర్ సెంటర్ ని ఎందుకు ప్రారంభించామంటే… హైద్రాబాద్ రానున్న రోజుల్లో ఒక అంతర్జాతీయస్థాయి మెడికల్ హబ్ గా మారబోతుంది. ఇప్పటికే ఇక్కడా ప్రపంచ స్థాయి వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయి. అందుకనుగుణంగా భవిష్యత్ లో మేము చేపట్టబోయే సరికొత్త వైద్యపరిశోధనలకు, మా క్యాన్సర్ కేర్ సెంటర్ విస్తరణకు హైద్రాబాద్ మాకు అన్ని విధాల అనుకూలం. క్యాన్సర్ ని ప్రారంభదశలోనే గుర్తించి, దాన్నుంచి పేషెంట్ ను పూర్తిగా బయటపడేయటమే మా కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్ ప్రధాన ఉద్దేశ్యం.