వీహెచ్‌కు అన్ని విధాల అండ‌గా ఉంటాంః సీఎం రేవంత్ రెడ్డి హామీ

congress-senior-leader-v-hanumantha-rao-meets-cm-revanth-reddy

హైదరాబాద్‌ః కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వి. హ‌నుమంత‌రావు సీఎం రేవంత్ రెడ్డిని క‌లిశారు. మ‌రో కాంగ్రెస్‌ నేత, ఎమ్మెల్సీ మ‌హేశ్ కుమార్ గౌడ్ ఆయ‌న‌ను ముఖ్య‌మంత్రి వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో వీహెచ్‌ పార్ల‌మెంట్ టికెట్ ఆశించారు. కానీ, టికెట్ త‌న‌కు వ‌చ్చే అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఆయన అల‌క‌బూనారు. దీంతో గ‌త కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ కార్య‌క్ర‌మాల‌కు ఈ సీనియ‌ర్ నేత దూరంగా ఉంటున్నారు.

ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల మీడియా స‌మావేశంలోనూ ఆయ‌న బ‌హిరంగంగానే అసంతృప్తి వ్య‌క్తం చేశారు. అయితే, ఇలా పార్టీకి దూరంగా ఉంటున్న వీహెచ్‌ను మ‌హేశ్ కుమార్ గౌడ్ బుజ్జ‌గించి సీఎం వ‌ద్ద‌కు తీసుకెళ్లారు. దాంతో సీఎం రేవంత్ రెడ్డి.. వీహెచ్‌కు అన్ని విధాల అండ‌గా ఉంటామ‌ని హామీ ఇచ్చారు.