ఫోర్బ్స్ సిఐఓ జాబితాలో కరీంనగర్ నగర్ వాసి రఘు

తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన తెలుగుతేజం

Raghu Sagi on Forbes CIO list
Raghu Sagi on Forbes CIO list

ప్రఖ్యాత ఫోర్బ్స్ సీఐవో జాబితాలో స్థానం దక్కించుకోవడం అంట ఈజీ కాదు. . అలాంటిది కరీంనగర్ కు చెందిన రఘు సాగి ఆ ఘనత సాధించారు ప్రస్తుతం ఆయన ఇన్స్పైర్ బ్రాండ్స్ మల్టీ నేషనల్ కంపెనీకి సీఐవోగా పని చేస్తున్నారు. రఘు సాగి తండ్రి డాక్టర్ సంజీవ్ రావు వెటర్నరీ వైద్యుడిగా పనిచేసి అసిస్టెంట్ డైరెక్టర్ గా పదవీ విరమణ పొందారు. రఘు సాగి తన ప్రాథమిక విద్యను వరంగల్ లోని సరస్వతి శిశుమందిర్ లో పూర్తి చేసి, జగిత్యాలలోని గీత విద్యాలయంలో హైస్కూల్ విద్యను పూర్తి చేశారు.
గుంటూరులోని విజ్ఞాన్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసి హైదరాబాద్ జేఎన్టీయూలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. అమెరికాలోని సౌతర్స్ ఎలినియోస్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశారు.

1992 అమెరికా వెళ్ళిన రఘు అంచెలంచెలుగా సిఐఓ స్థాయికి ఎదిగారు. తొలుత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కాస్మెటిక్ కంపెనీ సెఫోరాలో పనిచేసిన అనంతరం వాల్ మార్ట్ లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంజనీరింగ్ గా పని చేశారు ప్రస్తుతం ఇన్స్పైర్ బ్రాండ్స్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ ఫోర్బ్స్ సిఐఓ జాబితాలో చోటు దక్కించుకుని అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. ఇన్స్పైర్ బ్రాండ్స్ రెస్టారెంట్ లలో ఈ ఏడాది 30 బిలియన్ల యూ ఎస్ డి సేల్స్ సాధించడంలో విజయం దక్కించుకున్నారాయన .

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/