యాదాద్రిలో నేడు సీఎం కేసీఆర్ పర్యటన

రాయగిరిలో భారీ బహిరంగ సభ

హైదరాబాద్ : సీఎం కేసీఆర్​ జిల్లాల పర్యటనలో భాగంగా నేడు యాదాద్రి భువనగిరి జిల్లాకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు యాదాద్రి వెళ్లనున్నారు. యాదాద్రిలో నూతనంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్స్ ప్రారంభిస్తారు. యాదాద్రిలో నిర్మిస్తోన్న యాగశాలను పరిశీలించనున్నారు. ఒకటిన్నరకు భువనగిరికి సీఎం వెళ్తారు. భువనగిరి శివారులోని రాయగిరిలో నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షిస్తారు. ఆ తర్వాత.. 3.30కు పట్టణంలోని జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సాయత్రం 4 గంటలకు రాయగిరిలో కలెక్టరేట్​ పక్కనే నిర్వహించనున్న బహిరంగ సభలో కేసీఆర్​ పాల్గొంటారు. సీఎం పర్యటన దృష్ట్యా మంత్రి జగదీష్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

కాగా, నిన్న జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. జిల్లాలోని యశ్వంతపూర్‌ వద్ద టీఆర్ఎస కార్యాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్… అనంతరం టీఆర్ఎస్ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/