సిఎఎపై ఎవరి అభిప్రాయం వారు వెల్లడించొచ్చు

సిఎఎపై చర్చ అంటే అంతర్జాతీయ స్థాయిలో దేశభవిష్యత్ గురించి మాట్లాడటమే: సిఎం

cm kcr
cm kcr

హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈనేపథ్యలో అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చా కార్యక్రమంలో ప్రతిపక్ష సభ్యులు సిఎఎ అంశం లేవనెత్తడంతో సిఎం కెసిఆర్‌ స్పందించారు. సిఎఎను ఇప్పటికే చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తూ తీర్మాలు చేశాయి. తాము కూడా సిఎఎను పార్లమెంట్ లో వ్యతిరేకించామని, ఆ చట్టంపై అనేక అనుమానాలు ఉన్నాయి. జిఎస్టీ, ఐజీఎస్టీల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చే వాట రావడం లేదు. సిఎఎపై అసెంబ్లీలో చర్చజరగాలి. దేశాన్ని కుదిపేస్తున్న పౌరసత్వ సవరణ చట్టంపై చర్చజరగాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో భిన్నమైన అభిప్రాయలు కచ్చితంగా ఉంటాయి. సభలో ఎవరి అభిప్రాయం ఏదైనా సావధానంగా విందాం. సిఎఎపై చర్చ ఒకరోజుతో అయ్యేది కాదు. సిఎఎపై చర్చ అంటే అంతర్జాతీయ స్థాయిలో దేశభవిష్యత్ గురించి మాట్లాడటమే. బిజెపి సభ్యుడు రాజసింగ్ కూడా తనవాదనను వినిపించవచ్చు. సిఎఎపై అందరు సభ్యులకు అవకాశం కల్పించాలని స్వీకర్ ని కోరుతున్నా. సిఎఎపై ఎవరి అభిప్రాయం వారు వెల్లడించొచ్చు అని సిఎం కెసిఆర్ తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/