పని చేసే నరేందర్‌రెడ్డి కావాలా? వట్టి ఫాల్తుమాటలు మాట్లాడే రేవంత్‌రెడ్డి కావాలా? :సిఎం కెసిఆర్‌

CM KCR Speech At Kodangal BRS Public Meeting

హైదరాబాద్‌ః కొడంగల్‌ ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కెసిఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. నరేందర్‌రెడ్డి ఎన్ని పనులు చేయించాడు. తొమ్మిదేళ్లలో రేవంత్‌రెడ్డి ఏకాన పని చేయలేదు. వట్టి ఆల్తు ఫాల్తు మాటలు. వాన్ని తిట్టి వీన్ని తట్టి నోరుపారేసుకునుడు తప్పా ఏమన్నా పని జరిగిందా కొడంగల్‌లో ? నరేందర్‌రెడ్డి వచ్చాక ఏంత పని జరిగింది. ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినయ్‌. కెటిఆర్‌ దత్తత తీసుకొని అభివృద్ధి చేసిండు. బస్‌ డిపో యాడికేలి వచ్చింది ? డిగ్రీ కాలేజీ యాడికేలి వచ్చింది ? దవాఖానలు యాడికేలి వచ్చినయ్‌. రోడ్లు ఎక్కడికేలి వచ్చినయో ఆలోచన చేయాలి. పని చేసే నరేందర్‌రెడ్డి కావాలా? వట్టి ఫాల్తుమాటలు మాట్లాడే రేవంత్‌రెడ్డి కావాలా? మీరు నిర్ణయం చేయాలి అన్నారు. రేవంత్‌రెడ్డి నోరు తెరిస్తే గబ్బని.. అడ్డగోలుగా ఆల్తుఫాల్తు మాటలు మాట్లాడుతున్నాడని.. చిప్పకూడు తిన్నా సిగ్గురాలేదంటూ సిఎం కెసిఆర్‌ మండిపడ్డారు. తొమ్మిదేళ్లలో కొడంగల్‌లో ఏకాన పని చేయలదేని విమర్శించారు.

ఆయన నోరు తెరిస్తే గబ్బు. ఏం మాట్లడుతడు.. ఆయన గుణం ఏందో నరేందర్‌రెడ్డి చెప్పిండు కదా? కాంగ్రెస్‌ పార్టీ వాళ్లే చెబుతున్నరు. మనం చెబుతలేం. టికెట్లు అమ్ముకున్నడు. మా దగ్గర డబ్బులు తీసుకున్నడని గాంధీభవన్‌పై రాళ్లు విసురుతున్నరు. అది రేవంత్‌రెడ్డి. అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడే నాడు.. ఆంధ్రోళ్ల సంకలుండే. తెలంగాణ ఉద్యమకారులపైకి తుపాకీ పట్టుకొని బయలుదేరిండు తుపాకీ రామని లెక్క. ఎవడ్రా నాకు అడ్డం వస్తే కాల్చి చంపేస్తా అని.. తెలంగాణ వచ్చింది. మంచిగా నడుపుకుంటున్నం. ఏం చేసిండు రేవంత్‌రెడ్డి ? రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి.. బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కొనడానికి నగదు రూ.50లక్షలు ఇచ్చుకుంటూ దొరికిన దొంగ రేవంత్‌రెడ్డి. మీరంతా టీవీల్లో చూశారు కదా. పోలీసులు పట్టుకుపోయి జైలులో వేశారు. చిప్పకూడు తిన్నా సిగ్గురాలేదు. నువ్వు ఇట్ల దొరిగినవ్‌ కదనయ్యా అంటే.. అది నాకు మెడల్‌ అంటున్నడు. మరి ఏం మాట్లాడాలి ? వాడు వంకర పుట్టిండట. ‘ఎందుకు పుట్టినవ్‌రా వంకర అంటే.. సక్కగున్నోని ఎక్కిరించడానికి అన్నడట. ఇట్లున్నది రేవంత్‌రెడ్డి యవ్వారం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.