నాంపల్లి అగ్ని ప్రమాదం..సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి

kcr cabinet meeting updates
CM-KCR

హైదరాబాద్‌ః ముఖ్యమంత్రి కెసిఆర్ నాంపల్లి బజార్‌ఘాట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నాంపల్లి బజార్‌ఘాట్‌లోని ఓ భవనంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇప్పటికీ అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భవనంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో గ్యారేజ్‌ ఉండటంతో కారు రిపేర్‌ చేస్తుండగా మంటలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

అదే సమయంలో అక్కడ డీజిల్‌, కెమికల్‌ డ్రమ్ములు ఉండటంతో వాటికి మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని చెప్పారు. ఈ తరునంలోనే నాంపల్లి బజార్‌ఘాట్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. తక్షణమే పటిష్టమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. తీవ్రంగా గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని, ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.