మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలిస్తున్న సిఎం కెసిఆర్
cm-kcr-inspects-medigadda-reservoir
మేడిగడ్డ: సిఎం కెసిఆర్ కాళేశ్వరం పర్యటన కొనసాగుతుంది. సిఎం కొద్దిసేపటి క్రితం మేడిగడ్డ రిజర్వాయర్‌కు చేరుకున్నారు. అక్కడ పనులు పురోగతి నుంచి అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. పలు అంశాలపై అధికారులతో చర్చలు జరుపుతున్నారు. స్థానిక అధికారులతోపాటు ఉన్నతాధికారులు ప్రాజెక్టుకు సంబంధించిన తాజా వివరాలను ముఖ్యమంత్రికి వివరిస్తున్నారు.
కాగా, కాలేశ్వరం చేరుకున్న సిఎం కెసిఆర్ కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. కెసిఆర్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు ముఖ్యమంత్రి దంపతులకు వేద ఆశీర్వచనం అందించారు. తర్వాత సిఎం కెసిఆర్ మేడిగడ్డ రిజర్వాయర్‌కు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి సాయంత్రం తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/