వికారాబాద్‌లో టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సిఎం కెసిఆర్‌

CM KCR inaugurated TRS party office in Vikarabad

వికారాబాద్‌ః సిఎం కెసిఆర్‌ వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ కార్యాల‌యాన్ని ప్రారంభించారు. పార్టీ ఆఫీసుకు చేరుకున్న సీఎం కేసీఆర్.. అక్క‌డ టీఆర్ఎస్ జెండాను ఆవిష్క‌రించారు. అనంత‌రం రిబ్బ‌న్ క‌ట్ చేసి కార్యాల‌యంలోకి వెళ్లారు. పార్టీ ఆఫీసు లోప‌ల సీఎం ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కొప్పుల మ‌హేశ్వ‌ర్ రెడ్డి, పైల‌ట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు పాల్గొన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/