పద్మ అవార్డ్స్ దక్కించుకున్న వారికీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు..

CM KCR will go to Delhi today

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డ్స్ జాబితాలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం 106 మందితో కూడిన పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీతల జాబితాను గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందుగా కేంద్రం ప్రకటించింది. ఇక ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి కూడా నలుగురు ఉండడం విశేషం. మొత్తం 106 మంది ఉన్న ఈ జాబితాలో పద్మ విభూషణ్(6), పద్మభూషణ్(9), పద్మశ్రీ(91) గ్రహీతలు ఉన్నారు.

తెలంగాణ నుంచి ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు స్వామీ చిన్నజియార్(పద్మభూషణ్ అవార్డు), శ్రీ కమలేశ్ డీ పటేల్(పద్మభూషణ్ అవార్డు), మోదడుగు విజయ గుప్తా(పద్మశ్రీ అవార్డు), సామాజిక కార్యకర్త బీ. రామకృష్ణారెడ్డి(పద్మశ్రీ అవార్డు).. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్ఎమ్ కీరవాణి(పద్మశ్రీ అవార్డు), అబ్బారెడ్డి నాగేశ్వరావు(పద్మశ్రీ అవార్డు, సీవీ రాజు(పద్మశ్రీ అవార్డు), కోటా సచ్చిదానంద శాస్త్రీ(పద్మశ్రీ అవార్డు), ప్రకాశ్ చంద్రసూడ్(పద్మశ్రీ అవార్డు) కాకినాడవాసి సంకురాత్రి చంద్రశేఖర్‌(పద్మశ్రీ అవార్డు) దక్కించుకున్నారు.