చంద్రమోహన్‌ మృతిపట్ల సిఎం కెసిఆర్‌ సంతాపం

CM KCR condoles death of Chandramohan

హైదరాబాద్‌ః ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ మృతిపట్ల సిఎం కెసిఆర్‌ సంతాపం వ్యక్తం చేశారు. చంద్రమోహన్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దశాబ్దాలుగా ప్రేక్షకులను చంద్రమోహన్ అలరించారని.. ఆయన మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరనిలోటని అన్నారు. ఆయన స్ఫూర్తితో ఎందరో నటీనటులుగా ఎదిగారని చెప్పారు. తెలుగు, ఇతర భాషల్లో లక్షలాదిమంది అభిమానాన్ని సొంత చేసుకున్నారని తెలిపారు.

కాగా, ప్రముఖ నటులు చంద్రమోహన్‌ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌ అపోలో దవాఖానలో శనివారం ఉదయం 9.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు సోమవారం నిర్వహించనున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.