అహ్మద్‌ పటేల్‌ మృతిపట్ల కెసిఆర్‌ దిగ్భ్రాంతి

TS CM Kcr
TS CM Kcr

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన మృతిౖపట్ల తెలంగాణ సిఎం కెసిఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అహ్మద్‌ పటేల్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, కాంగ్రెస్‌ పార్టీ ట్రబుల్‌ షూటర్‌ అహ్మద్‌ పటేల్‌ ఇవాళ తెల్లవారుజామున కన్నుమూశారు. గత నెల 1న ఆయన కరోనా బారిన పడ్డారు. దీంతో ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంలో ఈనెల 15 నుంచి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆయన అవయవాలు చికిత్సకు సహకరించక పోవడంతో ఇవాళ ఉదయం 3.30 గంటలకు మరణించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/