నాటా తెలుగు మహా సభలను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ సందేశం

cm-jagan

అమరావతిః అమెరికాలోని డాల్లస్‌లో నాటా తెలుగు మహా సభలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సభలను ఉద్దేశించి సిఎం జగన్‌ తన సందేశం పంపించారు. సీఎం సందేశాన్ని నాటా సభల్లో కూడా ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాటా తెలుగు మహాసభలకు హాజరైన వారికి బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాని అన్నారు. నాలుగు సంవత్సరాల క్రతం తాను డాల్లస్ వచ్చినప్పడు మీరంతా చూపించిన ప్రేమ, అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపారు. వేరే దేశంలో ఉన్నప్పటికీ.. ఇంతమంది తెలుగువారు మన సంస్కృతి, సంప్రదాయాల్ని కాపాడుకుంటూ ఐక్యమతాన్ని చాటడం సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపారు.

అలాగే ఏపిలో గవర్నమెంట్ బడుల్లో పూర్తిగా రూపురేఖలు మరుతున్నాయని ప్రతి గ్రామంలో ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. నాడు నేడు అనే గొప్ప కార్యక్రమంతో స్కూళ్లలో అనేక మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. 3వ తరగతి నుంచే టోఫెల్‌లో శిక్షణ ఇచ్చేందుకు ఈటీఎస్ ప్రిన్స్‌టన్‌తో కూడా ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యా కానుక, ఉన్నత విద్యలో అయితే విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలన్నీ కూడా రాష్ట్రంలో గొప్పగా అమలు చేస్తున్నాని వెల్లడించారు. పోర్టులు, హార్బర్లు, ఎయిర్‌పోర్టులు, మౌలిక వసతులు, ఇండస్ట్రియల్‌ కారిడార్లు ఎప్పుడూ జరగని విధంగా ముందుకు అడుగులు పడుతున్నాయని స్పష్టం చేశారు.