ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌తో సీఎం కేజ్రీవాల్ సమావేశం

cm-arvind-kejriwal-met-delhi-lt-governor-vk-saxena

న్యూఢిల్లీః సిఎం అర‌వింద్ కేజ్రీవాల్ ఈరోజు ఢిల్లీ లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సెనాతో స‌మావేశ‌మ‌య్యారు. ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ దాడుల అనంత‌రం వీకే స‌క్సేనాను కేజ్రీవాల్ క‌ల‌వ‌డం ఇదే తొలిసారి. ప‌లు సంద‌ర్భాల్లో కేజ్రీవాల్ నిర్ణ‌యాల‌ను లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ప‌క్క‌న పెడుతూ వ‌స్తున్న విష‌యం విదిత‌మే. చాలా సంద‌ర్భాల్లో కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్‌కు కూడా ప‌లు వివాదాలు త‌లెత్తాయి. ఢిల్లీ మ‌ద్యం పాల‌సీని కూడా వీకే స‌క్సేనా తీవ్రంగా వ్య‌తిరేకించిన సంగ‌తి తెలిసిందే.

కేజ్రీవాల్ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన మ‌ద్యం పాల‌సీ.. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఉంద‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ విష‌యంలో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ జోక్యం చేసుకుని, విచార‌ణ జ‌ర‌పాల‌ని సీబీఐకి సిఫార్సు చేశారు. 2021– 2022లో తీసుకొచ్చిన ఈ పాలసీ విషయంలో నిబంధనలు ఉల్లంఘించారని, విధానపరమైన లోపాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఎల్జీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపిన సంగతి తెలిసిందే.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/