తమిళనాడు: ఇరువర్గాల ఘర్షణ..అల్లర్లు, విధ్వంసం

ఒకరు మృతి, పలువురికి గాయాలు

Clashes broke out between two communities
Clashes broke out between two communities

తమిళనాడు కడలూరు జిల్లాలో రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ విధ్వంసానికి దారితీసిం ది. తీవ్ర ఘర్షణల్లో ఒకరు మరణించగా, పలువు రు గాయపడ్డారు.

తలంగూడ గ్రామంలో పదుల సంఖ్యలో వాహనాలు, ద్విచక్రవాహనా లు, ఇళ్లు, కార్లు, పడవలు అగ్నికి ఆహుతి అయ్యాయి.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఫైరింజన్లు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నాయి.

ఈ అల్లర్లతో సంబంధం ఉందని అనుమానిస్తున్న 43 మంది ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు వర్గాల మధ్య రాజకీయ వైరుధ్యాలే ఈ ఘర్షణ లకు దారితీసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేల్చారు.

గతేడాది డిసెంబర్‌ నాటి పంచాయతీ ఎన్నికలే ఈ వివాదానికి మూల కారణమని పోలీసులు వెల్లడించారు.

అయితే, కొద్ది రోజుల కిందట స్థానిక నాయకుడి సోదరుడిని ప్రత్యర్థివర్గం హత్య చేయడంతో నివురుగప్పిన వివాదం బుసలు కొట్టింది.

దీంతో బాధిత వర్గం ప్రత్యర్థివర్గంపై ప్రతీకార దాడులకు దిగింది.

దీంతో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. 200 మంది పోలీసులు తలంగూడ గ్రామంలో మోహరించి, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/