సల్మాన్ ఖాన్ కు కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘గాడ్ ఫాదర్’ చిత్రం దసరా సందర్బంగా ఈ నెల 5న విడుదలై సూపర్ హిట్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ‘మసూద్ భాయ్’ అనే పవర్ ఫుల్ రోల్ పోషించాడు. చిరంజీవి – సల్మాన్ కలయికలో వచ్చిన సన్నివేశాలకు అభిమానులు నీరాజనాలు అందిస్తున్నారు. ఇక సినిమా సక్సెస్ కావడం పట్ల చిరంజీవికి శుభకాంక్షలు తెలిపారు సల్మాన్. “మైడియర్ చిరు గారూ ఐలవ్యూ” అంటూ ఓ వీడియో సందేశం పంపారు.

ఇక సల్మాన్ వీడియో కు చిరంజీవి కృతజ్ఞతలు తెలుపుతూ వీడియో పోస్ట్ చేసారు. “థాంక్యూ మైడియర్ సల్లూ భాయ్” అంటూ స్పందించారు. “మీకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే, గాడ్ ఫాదర్ అద్భుత విజయం వెనుక ‘మసూద్ భాయ్’ ఒక శక్తిలా నిలిచాడు” అంటూ చిరంజీవి కొనియాడారు. “థాంక్యూ… లవ్యూ సోమచ్… వందేమాతరమ్” అంటూ తన వీడియోలో పేర్కొన్నారు.

కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయగా.. RB చౌదరి, ఎన్వీ ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. సత్యదేవ్, లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక పాత్రలను పోషించగా , థమన్ మ్యూజిక్ అందించారు. ఇక ఆచార్య మూవీ ప్లాప్ కావడంతో మెగా అభిమానులు గాడ్ ఫాదర్ మూవీ ఫై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సినిమా ఉండడం తో ప్రేక్షకులు థియేటర్స్ కు పరుగులు పెడుతున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తున్నాయి.

తాజాగా చిరంజీవి కూడా ఓ వీడియోతో సల్మాన్ ఖాన్ కు బదులిచ్చారు. “థాంక్యూ మైడియర్ సల్లూ భాయ్” అంటూ స్పందించారు. “మీకు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే, గాడ్ ఫాదర్ అద్భుత విజయం వెనుక ‘మసూద్ భాయ్’ ఒక శక్తిలా నిలిచాడు” అంటూ చిరంజీవి కొనియాడారు. “థాంక్యూ… లవ్యూ సోమచ్… వందేమాతరమ్” అంటూ తన వీడియోలో పేర్కొన్నారు.