పార్టీ సాంగ్ వినగానే చిరు ఫస్ట్ రియాక్షన్ మాములుగా లేదు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య నుండి బాస్ సాంగ్ రావడమే కాదు యూట్యూబ్ లో దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, మాస్ మహారాజా రవితేజ కీలక అతిథి పాత్రలో నటిస్తుండగా తనకు జోడీగా కేథరిన్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలోని ‘బాస్‌ పార్టీ’ రిలికల్ పాట సినిమాపై అంచనాలను పెంచేసిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సాంగ్ ను మొదటిసారిగా చిరంజీవి విన్నప్పుడు ఆయన రియాక్షన్ ఎలా ఉందొ తెలిపారు మైత్రి మూవీ మేకర్స్. ముందుగా ఈ మాస్‌ పాటను ట్యూన్ చేసిన తర్వాత దేవిశ్రీ ప్రసాద్.. చిరంజీవి, దర్శకుడు బాబీతో పాటు సుకుమార్, చిత్ర నిర్మాతలకు వినిపించారు. ఈ పాట వినగానే అభిమానులను మించిన విధంగా వాళ్లంతా ఫిదా అయ్యారు. తొలిసారి పాట విన్నప్పుడు వారు ఇచ్చిన రియాక్షన్‌కు సంబంధించి చిత్ర బృందం తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. చిరు పాటను ఆస్వాదిస్తూ, చిన్నపిల్లాడిలా మారిపోయారు. సోఫాలో కూర్చుండే బీట్స్ కు తగ్గట్టు స్టెప్పులు వేశారు. సుకుమార్, బాబీ సైతం పొంగిపోయారు. దేవిశ్రీకి అభినందనలు తెలిపారు.