గాల్వాన్‌ మృతులకు చైనా శౌర్య పతకాలు

ఎట్టకేలకు అంగీకరిస్తూ చైనా వీడియో విడుదల

గాల్వాన్‌ మృతులకు చైనా శౌర్య పతకాలు
Galwan


Beijing: భారత్‌-చైనాల మధ్య గాల్వాన్‌ లోయలో చెలరేగిన ఘర్షణల్లో తమ సైనికులు నలుగురు చనిపోయినట్లు చైనా ఎట్టకేలకు అంగీకరింస్తూ ఒక విడియోని కూడా విడుదల చేసింది. చనిపోయినవారి త్యాగాలను స్మరించుకుంటూ చైనా సెంట్రల్‌ మిలటరీ కమిషన్‌ వారికి మరణానంతరం శౌర్య పురస్కారాలను ప్రకటించింది.

2020లో జూన్‌లో గల్వాన్‌ లోయలో భారత్‌, చైనా మధ్య జరిగిన జరిగిన ఘర్షణ ఉన్న విడియోని విడుదల చేసింది. అప్పటి ఘర్షణలో భారత సైనికులు 20 మంది చనిపోయారు. ఇదే సమయంలో తమ సైనికులు నలుగురు చనిపోయినట్లు చైనా వెల్లడించింది.

ఈ విడియోలో చనిపోయిన తమసైనికులకు చైనా దళాలు గౌరవ వందనం సమర్పిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఇందులో భారత్‌-చైనా అధికార్లు మాట్లాడుకోవడం కూడా కనిపిస్తున్నది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/