అంబానీ కొత్త జూపార్కు

అత్యంత అరుదైన జంతుజాలంతో

Ambani- New Zoo Park

Ahmedabad: ప్రపంచంలోనే అతిపెద్ద జూపార్కును గుజరాత్‌లో అంబానీ ఏర్పాటు చేస్తున్నారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పేరిట చమురు సహజ వాయువు, రిటైల్‌, టెలికాం రంగాలకు విస్తరించిన ముకేష్‌ అంబానిగ్రూప్‌ ఇపుడు కొత్తగా జంతుప్రదర్శన శాలల ఏర్పాటుకు ముందుకు వచ్చింది.

కోమోడో డ్రాగన్లు, చీటాలు, అరుదైన పక్షలు వంటివి ఈజూలో ఉంటాయని ఆసియా బిలియనీర్‌ వెల్లడించారు. అంబానిల స్వరాష్ట్రం గుజరాత్‌లో ఈజూను ఏర్పాటుచేయాలని నిర్ణ యించింది. 2023నాటికి పూర్తిచేసి జూను ప్రారంభించాలని రిలయన్స్‌ కార్పొరేట్‌వ్యవహారాల డైరెక్టర్‌ పరిమల్‌నాత్వాని వెల్లడిం చారు.

అయితేప్రాజెక్టు వ్యయం ఎంత ఉంటుందన్నది వెల్లడికాలేదు. టెక్నాలజీ, ఇకామర్స్‌ రంగాల్లో విస్తరించిన అంబానిలు 80 బిలియన్‌డాలర్ల విలువైన సంపదతో ఉన్నారు. ముంబయి ఇండియన్స్‌ క్రికెట్‌టీమ్‌ కూడా నిర్వహిస్తున్నారు.

2014లో సాకర్‌ లీగ్‌మ్యాచ్‌లునిర్వహించారు. కుటుంబసంపద పెరుగుతుండటంతో రిల్‌గ్రూప్‌ కూడా కొత్తకొత్త వెంచర్లలోకి వస్తోంది. ముఖేష్‌ అంబానీభార్య నీతా అంబాని న్యూయార్క్‌ మెట్రోపాలిటన్‌ మ్యూజియవ్‌ూఫ్‌ ఆర్ట్‌సంస్థ బోర్డు సభ్యుల్లో ఒకరుగా చేరారు. ప్రజాబాహుళ్యం ఎక్కువ ఉన్న రంగాల్లోపెట్టుబడులు పెడితే సంస్థ ప్రతిష్ట మరింత పెరుగుతుందన్న లక్ష్యంతోనే జూను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదే తరహాలో ఇండోనేసియా బిలియనీర్‌లో టక్‌క్వాంగ్‌ కూడా నాలుగు మిలియన్‌ డాలర్లతో జంతు ప్రదర్శనశాల ఏర్పాటు చేసారు. జార్జియా బిలియనీర్‌ మాజీ ప్రధాని బిద్‌జినా ఆవానిష్‌ విల్లి కూడా మూడు మిలియన్‌ డాలర్ల తో స్థానికంగా లభించే అరుదైన వృక్షజాతులు, జంతుజాలాలతో పార్కు ను ఏర్పాటు చేసారు. ఫిలిప్పినో బిలియనీర్‌ విలియమ్‌బెలో కూడా మొస ళ్ల పార్కు ఏర్పాటు చేసారు.

1989లో ఎగ్‌ఫామ్‌ ఏర్పాటుచేసిన తర్వాత వాటిని మొసళ్లకు ఆహారంగా వేసేందుకు ఏకంగా పార్కునే ఏర్పాటుచేసారు. అంబానీల తరహాలోనే ఇతర బిలియనీర్లుకూడా క్రీడా టీమ్‌ల్లో పెట్టుబడులు పెట్టారు. రోమన్‌ అబ్రా మోవిచ్‌ రష్యా రెండో అతిపెద్ద ఉక్కు దిగ్గజంగా నిలిచిన ప్రముఖులు. ఆయన లండన్‌లోని చెల్సియా సాకర్‌క్లబ్‌ను కొనుగోలు చేసారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/