ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు

మావోయిస్టు మృతి!

Counter fire in Chhattisgarh
Counter fire in Chhattisgarh

ఛత్తీస్‌గఢ్‌లో దంతెవాడ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం జవాన్లకు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్టు తెలిసింది. మావోయిస్టు మిలీషియా కమాండర్ వెట్టి హుంగాగా గుర్తించారు.

అతనిపై రూ.లక్ష రివార్డు ఉంది. మరికొందరు మావోయిస్టులు కూడా ఈ ఘటనలో మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. సంఘటనా ప్రాంతంలో ప్రాంతంలో 8 ఎంఎం పిస్టల్, నాటు తుపాకీ, రెండు కిలోల ఐఈడీ టపాసులు, మరికొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/