చంద్రమోహన్ మరణం వ్యక్తిగతంగా నాకు తీరని లోటుః చిరంజీవి

చంద్రమోహన్ తో తనకు గొప్ప అనుబంధం ఉందన్న చిరు

Chandramohan death is a personal loss for Chiranjeevi

హైదరాబాద్‌ః వైవిధ్య నటనా కౌశలం ద్వారా చంద్రమోహన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారని మెగస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ఆయన ఇకలేరని తెలవడం విషాదకరమని అన్నారు. తన తొలి సినిమా ‘ప్రాణం ఖరీదు’తో తామిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని, అది స్నేహంగా మారి గొప్ప అనుబంధం నెలకొందని వివరించారు. ఆ సినిమాలో ఆయన మూగవాడి పాత్రలో అత్యద్భుతంగా నటించారని మెచ్చుకున్నారు. చంద్రమోహన్ మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటని మెగస్టార్ చెప్పారు.

‘సిరిసిరిమువ్వ’, ‘శంకరాభరణం’, ‘రాధాకళ్యాణం’, ‘నాకూ పెళ్ళాం కావాలి’ లాంటి చిత్రాలలో చంద్రమోహన్ అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారని మెగస్టార్ చిరంజీవి చెప్పారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు. చంద్రమోహన్ కుటుంబానికి, ఆయన అభిమానులకు మెగస్టార్ ప్రగాఢ సంతాపం తెలిపారు.