ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి చేరుకున్న చంద్రబాబు

కాసేపట్లో చంద్రబాబుకు క్యాటరాక్ట్ ఆపరేషన్

chandrababu-reaches-lv-prasad-hospital

హైదరాబాద్‌ః టిడిపి అధినేత చంద్రబాబు హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రికి చేరుకున్నారు. కాసేపట్లో ఆయనకు వైద్యులు క్యాటరాక్ట్ ఆపరేషన్ ను నిర్వహించనున్నారు. ఆరోగ్య కారణాలతో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన ఇప్పటికే రెండు సార్లు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. నిన్న ఆయనకు వివిధ వైద్య పరీక్షలతో పాటు, చర్మ సంబంధిత చికిత్సను కూడా అందించినట్టు తెలుస్తోంది.