కారుతో ఢీ కొట్టిన యువకులు..ఎస్‌ఐకి తీవ్రగాయాలు

అనంతగిరిలో వాహనాలు తనిఖీ చేస్తోన్న సమయంలో ఘటన

nawabpet si
nawabpet si

హైదరాబాద్‌: వికారాబాద్ లోని నవాబ్ పేట్ ఎస్‌ఐ కృష్ణను కొందరు యువకులు కారుతో ఢీ కొట్టారు. వారు ఉద్దేశ పూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడ్డారా? అన్న విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనలో ఎస్‌ఐ కృష్ణ తీవ్రగాయాలతో హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అనంతగిరిలో వాహనాలు తనిఖీ చేస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో నలుగురు ఈ ఘటనకు పాల్పడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు టోలీచౌక్ కు చెందిన ఇమ్రాన్, అన్వర్, నవీద్, సమీర్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై డీజీపీ మహేందర్ రెడ్డి స్పందించారు. కృష్ణ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఆయన అందిస్తోన్న సేవలను అభినందిస్తున్నానని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/