సోలార్ ప‌వ‌ర్ స్కీమ్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం

Cabinet Approves Rooftop Solar Scheme

న్యూఢిల్లీః కోటి గృహాలకు ఉచిత సౌర విద్యుత్ అందించే లక్ష్యంతో ప్రభుత్వం​ తీసుకొచ్చిన ‘పీఎం సూర్య ఘర్ : ముఫ్త్ బిజిలీ యోజన’ పథకానికి కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. రూ.75 వేల కోట్ల పెట్టుబడితో ప్రారంభించిన ఈ పథకం కింద రూఫ్​టాప్ సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కోటి కుటుంబాలకు ఆర్థిక సాయం లభిస్తుంది. కేబినెట్​ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్​ ఠాకూర్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​ పొందగలుగుతారని వెల్లడించారు. ఇక పథకం కింద ఎంపికైన వారికి రూ.30వేలు(1kw రూఫ్​టాప్ సోలార్), రూ.60వేలు(2kw) చొప్పున ప్రభుత్వం రాయితీ ఇస్తుందని చెప్పారు.

అంతేకాకుండా ఈ సమావేశంలో మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 3 సెమీకండక్టర్ ప్లాంట్లకు పచ్చజెండా ఊపింది. వీటి నిర్మాణాన్ని 100 రోజుల్లో ప్రారంభిస్తామని తెలిపారు.