ఈటల రాజేందర్ ప్రస్టేషన్ కు గురివుతున్నాడని కౌశిక్ రెడ్డి కామెంట్స్

హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రస్టేషన్ కు గురివుతున్నాడని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. ఈరోజు బుధువారం హుజురాబాద్ టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఈటెల ఫై నిప్పులు చెరిగారు.

రాబోయే రోజుల్లో ఈటలకు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం అన్నారు. కేంద్ర ప్రభుత్వ పార్టీలో చేరావు. నీవు కేంద్రం నుండి 100 కోట్లు తీసుకురా, నేను 150 కోట్లు తీసుకొచ్చి హుజురాబాద్ నియోజకవర్గాన్ని కలిసి అభివృద్ధి చేద్దాం అన్నారు. ఈ నెల 5న అంబేద్కర్ చౌరస్తాలో హుజురాబాద్ అభివృద్ధిపై చర్చకు కూర్చుంటా.. ఈటల రావాలి. ఈ కార్యక్రమానికి హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు తప్ప వేరే వాళ్లు రావద్దు అని పాడి కౌశిక్ రెడ్డి పిలుపునిచ్చారు. 2018 ఎలక్షన్ లో నీకు నాకు పోటీ జరిగినప్పుడు కేసీఆర్ నీ వెనకాల ఉంటేనే గెలిచావు. ఇప్పుడు కేసీఆర్ నా వెనకాల ఉన్నారు. రాబోయే ఎలక్షన్ లో నువ్వా నేనా చూసుకుందాం అని సవాల్ చేశారు.