ఎన్నికల ప్రచారంలో స్పృహతప్పి పడిపోయిన ఎమ్మెల్సీ కవిత

brs-mlc-kavitha-fell-during-the-election-campaign

హైదరాబాద్‌ : ఎమ్మెల్సీ కవితకు స్వల్ప అస్వస్థత చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లాలో ఎమ్మెల్సీ కవిత సృహతప్పి పడిపోయారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల లో రోడ్ షో లో ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే సంజయ్. పాల్గొన్నారు ఈ సందర్భంగా రాయికల్ మండలం ఇటిక్యాలలో ప్రచార వాహనంలోనే కవిత స్పృహ తప్పి పడిపోయారు. దీంతో పక్కనే ఉన్న మహిళా కార్యకర్తలు ఆమెకు సపర్యలు చేశారు. అక్కడే ఉన్న గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్ ప్రాథమిక చికిత్స చేశారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. డీహైడ్రేషన్ వల్ల ఆమె పడిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. కాసేపు విరామం అనంతరం ఆమె తిరిగి ప్రచారాన్ని కొనసాగించారు.

ఇక అంతకు ముందు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత “ఎక్స్” లో ఆసక్తికర వీడియోని పోస్ట్ చేశారు. ధాన్యపు రాశుల తెలంగాణను ప్రతిబింబించేలా తాను స్వయంగా వీడియోను చిత్రీకరించారు. ఎన్నికల ప్రచారానికి గాను నిజామాబాద్ నుంచి జగిత్యాలకు వెళ్తున్న క్రమంలో ఆర్మూర్ లోని సిద్దులగుట్ట వద్ద రోడ్డుకు ఇరువైపులా రైతులు వడ్లను ఆరబెట్టిన దాన్ని వీడియోలో ఆమె చిత్రీకరించారు.