బ్రహ్మాస్త్ర నిడివి ఎంతో తెలుసా..?

e ,

భారతదేశ చరిత్రలో భారీ బడ్జెట్​, అత్యాధునిక సాంకేతికతతో తెరకెక్కించిన మూవీ బ్రహ్మాస్త్ర. తెలుగులో బ్రహ్మాస్త్రం పేరుతో విడుదల చేస్తున్నారు. దక్షిణాది భాషల్లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి డిస్ట్రిబ్యూట్​చేస్తున్నారు. స్టార్ స్టూడియోస్​, ధర్మ ప్రొడక్షన్స్​, ప్రైమ్ ఫోకస్​, స్టార్​లైట్ పిక్చర్స్​సంయుక్తంగా నిర్మిస్తున్న బ్రహ్మాస్త్రం సినిమాకు భారీగానే ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది.

తాజా సమాచారం మేరకు ఈ చిత్రానికి CBFC (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) UA సర్టిఫికేట్ తో క్లియర్ చేసిందని సమాచారం. సినిమా నిడివి వచ్చేసి సుమారు 166.54 నిమిషాల (2 గంటలు 46 నిమిషాలు మరియు 54 సెకన్లు) ఉన్నట్లు వినికిడి. బ్రహ్మాస్త్రం మూడు గంటల మార్కుకు చాలా దగ్గరగా ఉంది. ఆసక్తికరమైన విషయమేమిటంటే చాలా ఎక్కువ సేపు ఓపిగ్గా చూడాల్సి ఉన్నా కానీ ప్రేక్షకుల అంచనాల రేంజులో కంటెంట్ ఉంటుందని అంటున్నారు.

ఇదిలా ఉంటె బ్రహ్మాస్త్రం ఫస్ట్​రివ్యూ ను ప్రముఖ సెన్సార్ సభ్యుడు, విశ్లేషకుడు అయిన ఉమర్​సంధు ఇచ్చాడు. బ్రహ్మాస్త్రం చిత్రాన్ని వీక్షించిన ఆయన తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాన్ని పంచుకున్నాడు. బ్రహ్మాస్త్రం చిత్రం అన్ని విధాలుగా చాలా భారీ సినిమా. భారీ తారాగణం. భారీ కాన్వాస్​. ఎస్​ఎఫ్​కోసం భారీగా ఖర్చు. భారీగా ప్రమోషన్స్​. భారీ అంచానాలు. కానీ, బాధాకరం ఏంటంటే ఈ భారీ అంచనాలే నిరుత్సాహపరిచాయి. నిజానికి ఇది ఒక యావరేజ్​చిత్రం అన్నారు.

బాలీవుడ్​లో ఫాంటసీ, అండ్వెంచర్​సినిమాలు చాలా అరుదు. ఒక అద్భుతమైన ఊహా లోకాన్ని సృష్టించిన అయాన్ ముఖార్జీ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. కానీ, బ్రహ్మాస్త్రం సినిమా స్క్రీన్​ప్లే, కథ పూర్తి యావరేజ్​గా ఉన్నాయి. ఇంకా కొన్నిసార్లు గందరగోళంగా కూడా ఉందన్నారు. తనవరకు ఈ సినిమా కు 2.5 ఇస్తున్నట్లు తెలిపారు.