గోల్కొండలో తొలి బోనం

జగదాంబ అమ్మవారి ఆలయంలో ప్రారంభం

Golkonda bonam festival
Golkonda bonam festival

Hyderabad: ఆషాఢ మాస బోనాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. గోల్కొండ జ‌గ‌దాంబిక అమ్మవారికి తొలి బోనం స‌మ‌ర్పించ‌డంతో హైదరాబాద్‌లో ఉత్సవాలు మొదలుకానున్నాయి.రాష్ట్రంలో బోనాలు తొలిసారిగా గోల్కొండ జగదాంబ అమ్మవారి ఆలయంలోనే ప్రారంభం ఆనవాయితీ. గోల్కొండ బోనాలు ముగిసిన వారం తర్వాత లష్కర్ బోనాలు మొదలవుతాయి. నేడు ప్రారంభమయ్యే బోనాల సందడి వచ్చే నెల 8 వరకు కొనసాగుతుంది. ప్రతి గురువారం, ఆదివారం బోనాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా లంగర్ హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు జరగనుంది. మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ బగ్గీపై ఊరిగింపుగా వచ్చి… అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా జగదాంబ అమ్మవారికి తొమ్మిది రకాల ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సుమారు 600 మందికిపైగా పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/