బొల్లినేని వెంకట రామారావు తో మేకపాటి చంద్రశేఖరరెడ్డి భేటీ

టీడీపీ నేత బొల్లినేని వెంకట రామారావు తో మేకపాటి చంద్రశేఖరరెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ కి సపోర్ట్ చేసారని వైస్సార్సీపీ అధిష్టానం మేకపాటి చంద్రశేఖరరెడ్డి ని పార్టీ నుండి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి ఆయన టీడీపీ నేతలతో టచ్ లో ఉంటూ వస్తున్నారు. తాజాగా కలిగిరిలో బొల్లినేని వెంకట రామారావు క్యాంపు కార్యాలయంలో మేకపాటి – బొల్లినేని భేటీ అయ్యారు.

అనంతరం మేకపాటి మాట్లాడుతూ.. ఉదయగిరి అభివృద్ది కోసమే బొల్లినేనితో చేతులు కలిపినట్టు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డిని కూడా ఇప్పటికే కలిసినట్టు చెప్పారు. వీరిద్దరితోపాటు బీసీ నేత చెంచల బాబుయాదవ్‌తోనూ కలిసి పనిచేస్తూ ప్రజలకు అన్ని విధాల మేలు చేస్తానని పేర్కొన్నారు. ప్రజలతో మాట్లాడేందుకు త్వరలోనే బహిరంగ సమావేశం పెట్టనున్నట్టు తెలిపారు.