రేపు ఏపీ మంత్రివర్గ సమావేశం

ap-cabinet-decisions

రేపు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు కేబినెట్‌ సమావేశం జరగనుంది. మొత్తం 40 అంశాల అజెండాతో జరగనున్న కేబినెట్‌ సమావేశంలో కీలక చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో ప్రభుత్వ విభాగాల్లో కొత్త ఉద్యోగాలను ఏర్పాటు చేసే అంశం.. స్టేట్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ఏర్పాటుపై చర్చ .. ఆర్గానిక్ ఫార్మింగ్ ఉత్పత్తుల విషయంలో ప్రమాణాలను నిర్దేశించే అంశం వంటి అంశాల ఫై చర్చ జరగనుంది.

ఇప్పటికే 12 రాష్ట్రాల్లో ఈ తరహా అథారిటీలు ఉన్నట్టు ఏపీ ప్రభుత్వం గుర్తించింది. ఆర్గానిక్ ఫాంగా గుర్తించిన సంస్థలు మాత్రమే ఉత్పత్తులు విక్రయించేలా కొత్త విధానం తీసుకురానున్నారు. అలాగే ఆసరా రెండో విడత మొత్తాన్ని విడుదల చేసే అంశానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. గృహలు మంజూరైన లబ్ధిదారులకు రూ.35 వేల అదనపు రుణాన్ని ఇచ్చే ప్రతిపాదనపై చర్చించనుంది. వైజాగ్ లో ఏకలవ్య పాఠశాల ఏర్పాటు.. బద్వేలు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు ఆమోదం లభించడనుండగా.. శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనపై కేబినట్‌ చర్చించనుంది. మొత్తం మీద 40 ప్రధాన అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చలు జరిపి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.